
తెలంగాణ ప్రభుత్వం సహకారం తో తెలంగాణ మూవీస్ టివి డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆవిర్భావించిందని, ఇది ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ప్రకారం తెలంగాణ కార్మిక శాఖ అద్వర్యం లో రాష్ట్రస్థాయి యూనియన్ అని తెలంగాణ డబ్బింగ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు వి.కవితా రూన్సీ వివరించారు. ఇప్ప్‌టి వరకు 200 మంది యువ కళాకారులకు ఉచితంగా గుర్తించు కార్డులు ఇవ్వడం జరిగిందని, మరో 500 మంది కళాకారులను గుర్తించి వారికి ఉచితంగా గుర్తించు కార్డులు ఇవ్వబోతున్నట్టు పేర్కొన్నారు. ఈ యూనియన్ తెలంగాణ సినిమా ఇండసస్టీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తో అనుసంధానమైనదని, తెలంగాణ రాష్ట్రం లో గల డబ్బింగ్ స్టూడియోలలో జరిగే డబ్బింగులు ఈ తెలంగాణ డబ్బింగ్ యూనియన్ పరిధిలోకి వస్తాయని తెలియజేసారు. డబ్బింగ్ అసోసియేషన్లు కార్మిక శాఖ పరిధిలోకి రావని, అవి కేవలం సొసైటీ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయ్యాయని, అటువంటి అసోసియేషన్ లో ఉన్న సభ్యులు కార్మికుల కింద పరిగణించబడరని, వారు కార్మిక శాఖ పరిధిలోకి రారని తెలిపారు. ఆంధ్రా తెలంగాణ అనే బేధభావం. లేకుండా నైవుణ్యత ఉన్న డబ్బింగ్ కళాకారులకు ఉచితంగా గుర్తించు కార్డులు ఇస్తామన్నారు. డబ్బింగ్ అసోసియేషన్ల పేరుతో బెదిరించులకు పాలుపడితే మా యూనియన్ కి తెలియజేసినట్టెతే అటువంటి వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Telangana Moives & Tv Dubbing Artists Union
MIG-1, Block-6 , Flot no : 5, Bhaglingampalli, Hyderabad -44 ,Telangana, India
Call : +91 77802 60559
Email : info@tmtdau.in