వెనిజులా ప్రభుత్వ, ప్రతిపక్షాల మధ్య శుక్రవారం మెక్సికోలో చర్చలు జరుగుతాయని నేషనల్‌ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జి రొడ్రిగజ్‌ ప్రకటించారు. ఈ చర్చల్లో ఇరు పక్షాలకు చెందిన 9మంది ప్రతినిధులు పాల్గొంటారని ఆయన చెప్పారు. ప్రజాస్వా మ్యాన్ని, రాజకీయ అవకాశాన్ని గౌరవించడం మినహా మరో మార్గం లేదని ప్రతిపక్షం భావించడం ఒక మంచి పరిణామమని ప్రభుత్వ ప్రతినిధి బృంద నాయకుడు వ్యాఖ్యానించారు. వెనిజులాపై దండెత్తండంటూ ఇచ్చిన పిలుపులు విఫలం కావడంతో ప్రతిపక్షం చర్చలకు వచ్చిందని అన్నారు. నార్వే, మెక్సికో మధ్యవర్తిత్వంతో వెనిజులా ప్రభుత్వం, ప్రతిపక్షం ఆగస్టులో చర్చల క్రమాన్ని చేపట్టాయి.

ఆ చర్చల ఫలితంగానే ఇరు పక్షాల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. మంగళవారం అధ్యక్షుడు మదురో మాట్లాడు తూ, అమెరికా ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. అమెరికా, యురోపియన్‌ యూనియన్‌ విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల వెనిజులాకు 3100కోట్ల డాలర్ల మేరకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఆంక్షల కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన ఆస్తులను వెనక్కి తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *